హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకం

Hyderabad Metro MD: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్‌ (ఎండీ)గా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. ఆయన ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇతర నియామకాలు:



ఎన్వీఎస్ రెడ్డి: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

రాజిరెడ్డి: చీఫ్ రేషనింగ్ ఆఫీసర్

కోటా శ్రీవత్స: HMDA సెక్రటరీ

శృతి ఓజా: మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్

కృష్ణ ఆదిత్య: సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ

ఈ బదిలీలు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కీలక మార్పుల సమయంలో జరిగాయి. హైదరాబాద్ మెట్రోలో భాగస్వామ్యం కలిగిన ఎల్ అండ్ టీ సంస్థ, భారీ నష్టాలు, అప్పుల కారణంగా తమ వాటాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ వాటాలను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఒక స్పెషల్ పర్పోజ్ వెహికల్ (SPV) ద్వారా ఈ విక్రయం జరగాలని ఎల్ అండ్ టీ కోరింది. ఈ విషయంపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ పంపినట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story