Telangana Investment Drive in Delhi: దిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ ప్రచారం.. సీఎం రేవంత్‌తో భారీ సమావేశం
భారీ సమావేశం

Telangana Investment Drive in Delhi: ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’కు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 29న జరగనున్న ఈ కార్యక్రమం, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమిట్‌కు కర్టెన్‌రైజర్‌గా నిలవనుంది.
ఈ సందర్భంగా వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అలాగే అనేక దేశాల ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను ఆయన వివరించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను సమిట్‌లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటికే పలు దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది. దిల్లీ కార్యక్రమానికి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తైవాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇండో-కెనడా బిజినెస్ ఛాంబర్ తరఫున అతిథులు, అలాగే వివిధ స్టార్టప్‌ల సీఈఓలు హాజరు కానున్నారు. సీఐఐ, ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా ఉంటాయి.

