ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Telangana Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎస్‌ఈసీ కమిషనర్ రాణికుముదిని ఈ వివరాలను ప్రకటించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది. అక్టోబర్ 23న మొదటి దశ, 27న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలకు మొదటి దశ అక్టోబర్ 31న, రెండో దశ నవంబర్ 4న, మూడో దశ నవంబర్ 8న జరుగుతాయని వివరించారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుందని ఎస్‌ఈసీ తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story