High-Tech Bus Stations: తెలంగాణలో 13 చోట్ల ఆధునిక హైటెక్ బస్టాండ్లు – ఫుడ్‌కోర్టులు, షాపింగ్, వినోదం సదుపాయాలు
సదుపాయాలు

High-Tech Bus Stations: తెలంగాణ రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో నూతన హైటెక్ బస్టాండ్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ఫుడ్‌కోర్టులు, షాపింగ్, వినోద కేంద్రాలకు ప్రత్యేక స్థలం కేటాయిస్తామని సంస్థ వెల్లడించింది.
నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ బస్టాండ్లు రాబోతున్నాయి. ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తి ఉన్న వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.
ఇప్పటికే కొడంగల్, మద్దూరు, కోస్గి, హుస్నాబాద్‌లలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొడంగల్‌లో 1.91 ఎకరాల్లో తొలి ఆప్షన్‌గా 39,558 చ.అ. విస్తీర్ణంతో రూ.15.82 కోట్ల అంచనా వ్యయంతో, రెండో ఆప్షన్‌గా 28,832 చ.అ.ల్లో రూ.11.53 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. కోస్గిలో 1.55 ఎకరాల్లో ఆప్షన్-1లో 41,400 చ.అ.ల్లో రూ.15.08 కోట్లు, ఆప్షన్-2లో 24 వేల చ.అ.ల్లో రూ.9.60 కోట్లు ప్రతిపాదించారు. మద్దూరులో 1.05 ఎకరాల్లో ఆప్షన్-1 కింద రూ.7.6 కోట్లతో 19 వేల చ.అ., ఆప్షన్-2 కింద రూ.4.48 కోట్లతో 11,200 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణం జరగనుంది.
ఈ హైటెక్ బస్టాండ్లు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం అందించడంతో పాటు స్థానిక వ్యాపారాలకు కూడా కొత్త అవకాశాలు కల్పించనున్నాయి.

