గిరి ప్రదక్షణ చేస్తుండగా గొంతుకోసి చంపిన దుండగులు

దైవదర్శనం కోసం అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుండగా దొంగల చేతిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు హతమయ్యాడు యాదాద్రి భువనగిరి జల్లా మోత్కూరు పట్టణంలని ఇందిరానగర్‌ కు చెందిన విద్యాసాగర్‌ మెడికల్‌ రిప్రజెంటెటీవ్‌ గా పనిచేస్తూ కంపెనీ క్వర్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన తండ్రి రవీందర్‌ ఎస్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్ గా అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 6వ తేదీన అరుణాచలం బయలుదేరి వెళ్ళి ఆ మర్నాడు రాత్రి గిరిప్రదక్షిణ చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యా సాగర్‌ పై దాడి చేసి గొంతు కోసారు. ఆ రోజు రాత్రంతా అతను కొనూపిరితో రోడ్డుపైనే పడి ఉన్నాడు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 8వ తేదీన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో విద్యాసాగర్‌ మృతి సమాచారాన్ని పోలీసులు అతని తల్లిదండ్రులకు చేరవేయగా వారు వెళ్ళి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్యోగం చేస్తున్న కుమారుడికి తర్వరలోనే వివాహం చేయాలని భావిస్తున్న సమయంలో ఈదారుణం జరగడంతో విద్యాసాగర్‌ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story