‘Chalo Lok Bhavan’ Rally: ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

నెక్లెస్ రోడ్ నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు అనేక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. లోక్‌భవన్ చేరుకున్న వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రధాని మోదీ నివాసం వద్ద నిరసన తెలిపిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండించారు. “నీట్ పరీక్ష పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. దీనిపై ప్రశ్నించిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్యలకు అందరూ వ్యతిరేకంగా నిలబడాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలి” అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story