సీయం రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌ పై కేటీఆర్‌ కౌంటర్‌

మీడియా చిట్‌ చాట్‌ పేరుతో సీయం రేవంత్‌ రెడ్డి నాపైన, ఇతరుల పైనా విషం చిమ్మడం ఇదే మొదటి సారి కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియోతో ఇష్టాగోష్టి నిర్వహించి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులపై ఆరోపణలు చేయడంప కేసీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకూ సంయమనం పాటించామని కేటీఆర్‌ చెప్పారు. డ్రగ్స్‌ కేసులో నాపై విచారణ జరుగుతోందని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం చూపించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నా పైన ఏమైనా కేసు నమోదు అయిందా? కనీసం అణువంత రుజువైన ఉందా అని కేటీఆర్‌ నిలదీశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే దొంగ చాటుగా చేసిన వ్యాఖ్యలపై... ఆధారాలు బయట పెట్టాలనీ కేటీఆర్‌ సవాలు విసిరారు. ఆధారాలు చూపించలేకపోతే తాను చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని సీయం ఒప్పుకోవాలన్నారు. హైదరాబాదులో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీ వరకు ప్రయాణం చేసి మరి రేవంత్ రెడ్డి నాపై బురద జల్లుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు.

కేవలం చట్టం పరిధి నుంచి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్ చాట్ ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. పిరికి దద్దమ్మలా చిట్ చాట్ ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి వ్యక్తిత్వహననాన్ని సహించేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దురుద్దేశ పూర్వకంగా రేవంత్‌ రెడ్డి చేసిన అసత్య నిందలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీయం నాపై చేసిన నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story