టీకాంగ్రెస్‌ నేతలకు మల్లికార్జున ఖర్గే హెచ్చరిక

పార్టీలో గ్రూపులు కడితే భయడే ప్రసక్తే లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను తీవ్ర స్ధాయిలో హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్‌ లో జరిగిన టీపీసీసీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే నాయకులను పార్టీ ఎప్పుడూ పట్టించుకోదని తేల్చి చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు చాలా పేలవంగా ఉందని మల్లిఖార్జున ఖర్గే సమావేశంలో సీరియస్‌ అయ్యారు. పార్టీలో కొత్తా… పాత అనే తేడా ఉండటానికి వీలు లేదని, అందరూ పార్టీకి సమానమే అని స్పష్టం చేశారు. ఎదైనా మాట్లాడేది ఉంటే పార్టీ సమావేశాల్లో మాట్లాడాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు. బయట ఎటువంటి వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పారు. విభేదాలు ఉంటే మీనాక్షీ నటరాజన్‌ దృష్టికి తీసుకు వెళ్లి ఆమోతో కోర్డినేట్‌ చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలిచి కాంగ్రెస్‌ సత్తా చాటాలని కాంగ్రెస్‌ నేతలకు మల్లిఖార్జున ఖర్గే నిర్దేశనం చేశారు. త్వరలోనే అన్ని కమిటీలు నియమించాలని పీసీసీని ఆదేశించారు.

Updated On 4 July 2025 5:26 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story