నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Ganesh Immersion: వినాయక చవితి ఉత్సవాల సమాప్తి సందర్భంగా సెప్టెంబరు 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబరు 7 ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్‌లో గణేశ విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నిమజ్జనం కోసం ప్రభుత్వం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్‌ వాటర్‌ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్‌ పాండ్లను సిద్ధం చేసింది. నిమజ్జన సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా, భక్తులకు ఇబ్బందులు రాకుండా విద్యుత్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల వెంట ఒక విద్యుత్‌ శాఖ అధికారి నిఘా ఉంచనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story