ముఖ్య అతిధులుగా హాజరైన ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే

తెలంగాణ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్‌ లో సమావేశం అయ్యింది. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్‌ లు ఈ సమావేశానిలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గడచిన సంవత్సరంన్నరగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజల్లో వాటిపై వస్తున్న స్పందన, పార్టీ పనితీరు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే రేవంత్‌ సర్కార్‌ నిర్వహించిన బీసీ కుల గణన, అమలు చేసిన ఎస్సీ వర్గీకరణలపై కూడా చర్చిస్తారు. వీటితో పాటు జై బాపు జై భీమ్‌ జై సంవిధాన్‌, సంవిధాన్‌ బచావో కార్యక్రమాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ సంస్ధాగత నిర్మాణంపై కూడా ఈ సమాశంలో చర్చ జరుగుతుంది. అలాగే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణలపై కూడా పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ కూలంకుషంగా చర్చించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఏఐసీసీ ఇంఛార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క, బీఏసీ సభ్యులు ఇతర సీనియర్‌ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated On 4 July 2025 12:09 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story