ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం.. విస్తృత తనిఖీలు

Transport Department Crackdown on Private Buses in Hyderabad: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, బెంగళూరు హైవేలపై ఆర్టీఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. రాజేంద్రనగర్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలు, వైద్య కిట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనలు అతిక్రమించిన ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సు అద్దం పగిలిన స్థితిలో నడుస్తుండగా, జడ్చర్ల వద్ద ఆ బస్సు ఇటీవల ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. దీంతో ఆ బస్సును అధికారులు సీజ్‌ చేశారు.

అదేవిధంగా, ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు, ఒక బస్సును సీజ్‌ చేశారు. రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story