కాంగ్రెస్, భాజపా కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయి

వచ్చే మా ప్రభుత్వంలో హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు సరఫరా: కేటీఆర్

KTR Demands Action: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. వేధింపులకు గురైన బాలికకు కాంగ్రెస్, భాజపా పార్టీలు కలిసి అన్యాయం చేయడానికి ప్రయత్నించాయని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ‘నా బూత్.. నా భవిష్యత్తు’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన “బాలికకు అన్యాయం జరిగినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. ఆమెకు న్యాయం కోసం భారాస మాత్రమే పోరాడింది. ప్రధాన మంత్రి ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అంటున్నారు కానీ, బాలికలకు న్యాయం చేయడం లేదు” అని విమర్శించారు.

కేంద్ర మంత్రి కుమారుడికి లుకౌట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని, బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయకపోతే విచారణ సరిగా జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. బాలిక తల్లిదండ్రులను పిలిచి బెదిరింపులకు పాల్పడ్డారని, ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఆమె తల్లిదండ్రుల పోరాటం గొప్పదని ప్రశంసించారు. ఈ తీవ్రమైన కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

హైదరాబాద్ అభివృద్ధి ప్రకటనలు

హైదరాబాద్‌లో నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు నిర్మించింది భారాస ప్రభుత్వమేనని, ఎల్బీనగర్‌లో ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని, దాని ముందు ధర్నా చేస్తామని కేటీఆర్ తెలిపారు. 2028లో భారాస ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ఇంటింటికీ 24 గంటల తాగునీరు సరఫరా చేస్తామని వాగ్దానం చేశారు. జూన్‌లో సభ్యత్వ నమోదు, జులైలో డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

బిహార్‌లో 60 లక్షలు, పశ్చిమబెంగాల్‌లో కోటి మంది ఓటర్లను తొలగించారని, నగరంలో మైనారిటీ ఓటర్లకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story