Vem Narender Reddy: కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ వేం నరేందర్‌రెడ్డికి ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన వేం నరేందర్‌రెడ్డి, రాజ్యసభకు అవకాశం కల్పించిన సోనియా గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, రాష్ట్ర మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల వికాసం, అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత వేం నరేందర్‌రెడ్డి సోనియా గాంధీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, సీతక్క, వివేక్‌, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు హాజరై వేం నరేందర్‌రెడ్డిని సత్కరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story