మాజీ మంత్రి హరీష్‌ రావుని కలసిన బాధిత కుటంబాలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సిగాచి పరిశ్రమలో గత నెల 30వ తేదీన జరిగిన ప్రమాద కారణాలను కనుగొనేందు ప్రభుత్వం నియమించిన హైలెవల్‌ కమిటీ విచారణ పూర్తయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైలెవల్‌ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి, అనేక మందిని విచారించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి కూడా సమర్పించింది. ఈ నివేదికపై సోమవారం సాయంత్రం జరగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రసాయన పరిశ్రల్లో సంభవించే ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన నివారణ చర్యలు, విధివిధానాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిగాచి కంపెనీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలు మాజీ మంత్రి హరీష్‌ రావును సోమవారం కలిశాయి. ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని, ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ తమకెవరికీ పరిహారం అందలేదని హరీష్‌ రావు వద్ద తమ గోడు వెళ్ళబోసుకున్నారు. హరీష్‌ రావు సిగాచి బాధితులకు ధైర్యం చెప్పారు. బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని హరీష్‌ రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కోటి రూపాయల పరిహారం ఇవ్వకుంటే కంపెనీ ముందు టెంట్‌ వేసుకుని కూర్చుంటాని, పరిహారం అందేకాకా టెంట్‌ తీయమని మాజీ మంత్రి హరీష్‌ రావు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story