Minister Sridhar Babu: పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు అధిక ఉపాధి అవకాశాలు సృష్టించాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. 2047 నాటికి దేశం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు.

సంగారెడ్డి జిల్లా తోగర్‌పల్లి ప్రాంతంలో కేజేఎస్ (KJS) పరిశ్రమ ఏర్పాటుకు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ‘‘పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. జహీరాబాద్‌లో NIMZ (National Investment and Manufacturing Zone) మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని’’ తెలిపారు.

ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. యువత నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేజేఎస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు వేలాది ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story