Minister Seethakka: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వారు సమర్పించే ప్రతి వినతిపత్రంపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారితో మాట్లాడారు. సమస్యల స్వభావాన్ని తెలుసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు.

ధరణి అమలులో అక్రమాల కారణంగా తమ భూములు ఇతరులు ఆక్రమించుకున్నారని, పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో మార్పులు జరిగాయని పలువురు బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని పలువురు కోరగా, పోలీసు నియామకాల్లో వయోపరిమితి పెంచాలని యువత విన్నవించింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలతో నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తివేయాలని పలువురు వినతిపత్రాలు సమర్పించారు.

మొత్తం 200 పైగా అర్జీలు వచ్చాయని మంత్రి తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story