15 పార్లమెంట్‌ స్ధానాల్లో విజయం సాధిస్తామన్న సీయం రేవంత్‌ రెడ్డి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద అసెంబ్లీ, 15 లోక్‌ సభ స్థానాల్లో గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారం చేపడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో సీయం రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణలో మాకు తిరుగులేదనే అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశామని అన్నారు. ఇదే ఎల్‌బీ స్టేడియం నుంచే ప్రజా పాలనకు నాంది పలికామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మూణ్ణాళ్ళ ముచ్చటని, సంక్షేమ పథకాలు అమలు చేయరని, ఐకమత్యంగా ఉండరని పలు విధాల గేలి చేశారని, కానీ నవ్విన వాళ్ళ ముందే తలెత్తుకుని నిలబడి ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ మోడల్‌ ని దేశం అనుసరించేలా తీర్చిదిద్దామని రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్‌, పేదలకు సన్న బియ్యం, రైతు రుణ మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. వరి వేస్తే ఉరే అని నాటి ప్రభుత్వ చెపితే మీరు వరి వెయ్యండి సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని మనం చెప్పామన్నారు. ఈ వేదికగా సవాల్ విసురుతున్నా… మోదీ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, కెసీఆర్ వస్తాడో రండి అని సీయం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు.

పేదలకు రూ.5 కి భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే కొందరు సన్నాలు విమర్శలు చేస్తున్నారని అసలు పేదల సంక్షేమం అంటే నే ఇందిరమ్మ అని సీయం వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టామని, వాళ్ళు ఆత్మగౌరవంతో బతికేలా ప్రోత్సహించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుక వెళుతోందని సీయం స్పష్టం చేశారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థికంగా నిలబడమని వేదిక మీద నుంచి సీయం పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీయం తెలిపారు. కిషన్‌ రెడ్డి, కేసీఆర్‌ లకు సవాల్‌ విసురుతున్న ఉద్యోగాల భర్తీలో మేము చెప్పిన లెక్క ఒక్కటి తగ్గినా క్షమాపణలు చెబుతా అని అన్నారు. వంద నియోజకవర్గాల్లో 20వేల కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాశికలు వేసుకున్నామన్నారు.

పార్టీ కార్యకర్తలకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాదని సీయం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150 కి పెరగబోతున్నాయని చెప్పారు. అలాగే మహిళా రిజర్వేషన్ రాబోతోంది.. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారని సీయం తెలిపారు. మీరు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మీ టిక్కెట్‌ మీ ఇంటికే వస్తుందని సీయం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస నేతలకు భరోసా ఇచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story