Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదన్నోడు అజ్ఞాని – కేసీఆర్
బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ కావచ్చు అంతమాత్రాన భయపడవద్దన్న కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు పనిరాదన్నవాడు అజ్ఞాని అయ్యుంటాడని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితర బీఆర్‌ఎస్ నేతలతో భేటీ అయిన కేసీఆర్ పీసీఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఆయన కొట్టిపడేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ ఎద్దేశా చేశారు. కమిషన్ నివేదిక మనం ఊహించిందే అని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అసరం లేదని స్పష్టం చేశారు. పీసీఘోష్ నివేదికను అడ్డం పెట్టకుని కొంత మంది బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఆ అరెస్ట్‌లకు ఎవరూ భయపడవద్దని కేసీఆర్ బీఆర్‌ఎస్ నాయకులకు ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. ఆ ప్రాజెక్టువల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. క్యాబినేట్‌లో కాళేశ్వరం వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దామన్నారు.
