Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని విజయపథంపై నడిపించి, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. అంతవరకు తాను ముఖ్యమంత్రిగానే కొనసాగతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాహుల్‌ తర్వాతి స్థానంలో ఉంటానని కూడా వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే రాహుల్‌ గాంధీ లక్ష్యమని, ఆయనకు ప్రధానమంత్రి పదవి మీద కోరిక లేదని చెప్పారు. అయితే, ఆ పదవికి పోటీ పడాలని తాను రాహుల్‌ను ఒప్పించానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story