ఎల్బీ స్టేడియం కౌంట్‌ డౌన్‌ వేడుకల్లో కిషన్‌ రెడ్డి

ప్రదానమంత్రిగా నరేంద్ర మోదీ అయిన తరువాత ప్రపంచానికి భాతదేశం అందించిన అద్భుతమైన బహుమతి యోగా అని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. రేపు శనివారం జూన్‌ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సశం సందర్భంగా హైదరాబాద్‌ లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో కిషన్‌ రెడ్డి విద్యార్థులతో భారీయెత్తున యోగా ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు, ఆదేశాధినేతలు, ఆయా దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి ఆచరిస్తున్నారని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అంశమన్నారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని కిషన్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 21వ తేదీన అన్ని ప్రాంతాల్లో యోగా చేసి వేడుకలు జరుపుకోవాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఎల్‌బీ స్టేడియంలో కౌంట్‌ డౌన్‌ వేడుకలను నిర్వహించుకుంటున్నామని కేంద్రమంత్రి ప్రకటించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో కలసి యోగాలో పాల్గొనడం సంతోషకరమని, ఈ వేడకల్లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనడం మనందరికీ గర్వకారణమన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుందని కేంద్ర మంత్రి వివరించారు. యోగానే మనకు ప్రథమ డాక్టర్. యోగా సర్వరోగ నివారిణి యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి అందువల్ల యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కోరారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story