Young India Skills University: తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య 1,000కి చేరుకుంది. ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు తగిన నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది ఆగస్టు 1న ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని నడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాన్సలర్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్బారావు వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన మేనేజ్‌మెంట్ బోర్డు ఈ యూనివర్సిటీని పర్యవేక్షిస్తోంది.

బోర్డు ఛైర్మన్‌గా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక క్యాంపస్‌లో లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో స్వల్పకాలిక మరియు సర్టిఫికేట్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డీస్ ల్యాబ్స్, ఏఐజీ, అపోలో హాస్పిటల్స్, జీఎంఆర్ కార్గో వంటి ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story