పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేమని, దూరంగా ఉంచాలని వ్యాఖ్య

US Senator Lindsey Graham Issues Warning: అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేమని, ఆ దేశాన్ని వీలైనంత దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. అయితే, ఈ క్రమంలోనే ఇరాన్‌కు సైనిక సహకారం అందిస్తోందన్న ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఇరాన్ తన యుద్ధ విమానాలను అమెరికా దాడుల భయంతో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లకు తరలించిందని వార్తలు వచ్చాయి. గూఢచర్య కార్యకలాపాలకు ఉపయోగపడే RC-130 విమానం కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లిండ్సే గ్రాహం స్పందించారు. “పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేము. ఆ దేశాన్ని వీలైనంత దూరంగా ఉంచుతాను. ఇరాన్ విమానాలను పార్క్ చేయడానికి పాక్ అనుమతి ఇస్తే, అమెరికా మధ్యవర్తిత్వం కోసం మరో దేశాన్ని వెతకాలి. అందుకే శాంతి ఒప్పందం విషయం ఇంకా తేలడం లేదు” అని అనుమానాలు వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ఎయిర్‌బేస్‌లలో ఇరాన్ సైనిక విమానాలకు ఆశ్రయం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడారు. మరో మధ్యవర్తిని వెతకడం లేదని వెల్లడించారు.

ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story