• వెనక్కి తగ్గుతున్న ట్రంప్
  • దూకుడు తగ్గించిన అమెరికా అధ్యక్షుడు
  • స్టార్ లింక్ సర్వీస్ భేష్..
  • అది తొలగించే పనిలేదన్న ట్రంప్
  • గతంలో మస్క్ తో బంధం బాగుండేదని వ్యాఖ్య
  • మస్క్ స్థానంలో ఉంటే తానే ముందు మాట్లాడేవాడినని ప్రకటన
  • గత వారం ఇద్దరి మధ్య మాటల యుద్ధం
  • సోషల్ మీడియాలో తిట్ల దండకం.. విసుర్లు
  • టెస్లా కారు కూడా వాడబోనని బెదిరింపు
  • వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో ఇద్దరి మధ్యా దూరం
  • మస్క్ కాంట్రాక్టులు తీసేస్తానని బెదిరింపు
  • చర్చలకు తిరిగి సిద్ధమన్న రీతిలో సంకేతాలు
  • డోనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ కలుస్తారా?

పరస్పర దూషణలు, నడివీధికెక్కి తిట్ల దండకంతో అల్లరైన ట్రంప్, ఎలాన్ మస్క్ జంట మళ్లీ కలుస్తారా? పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. రష్యా ఇతర మిత్రుల జోక్యంతో ఎపిస్టిన్ ఫైల్స్ ను పక్కన పడేసిన మస్క్ ట్రంప్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ డిలీట్ చేసి శాంతి చర్చలకు పచ్చ జెండా ఊపారు.. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక స్టెప్ వెనక్కి వేసినట్లే కనిపిస్తోంది. మస్క్ తో తేడా వచ్చినప్పుడు తాను మస్క్ కంపెనీకి చెందిన టెస్లా కారును కూడా వాడటం మానేస్తానంటూ చిర్రుబుర్రులాడారు. ఇప్పుడు మస్క్ తో మాట కలిపేందుకు తాను సిద్దమన్న సంకేతాలు పంపుతున్నారు.అయితే తానో దేశాధ్యక్షుడినన్న గర్వమో మరేంటో కానీ మస్కే తనముందుకొచ్చితనను ముందు పలకరించాలని కోరుకుంటున్నారు.వైట్ హౌస్ లో ఉన్న స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ను మాత్రం తొలగించేది లేదని ఆ సర్వీస్ చాలా బాగుందని కితాబిచ్చారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించినందుకు ప్రతిగా మస్క్

టెస్లా కారును తాను వాడబోనంటూ మొదట్లో మీడియా ముందే చిందులేశారు ట్రంప్.పైకి చెప్పలేదుకానీ ట్రంప్ మనసులో మస్క్ తన ముందుకొచ్చి మాట్లాడితే బాగుండన్న భావన ఉంది. తానే మస్క్ స్థానంలో ఉంటే తానే ముందు మాటాడాలని కోరుకునేవాడినని అన్నారు.

మస్క్ తో తన బంధంపై కామెంట్ చేయమంటే మస్క్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉండేవని మీరు గుర్తుంచుకోవాలి అని కామెంట్ చేశారు.మస్క్ తో వ్యాపార సంబంధాలపై ప్రశ్నించగా, స్టార్ లింక్ సర్వీస్ మాత్రం తొలగించబోను.ఆ సర్వీస్ బాగుంది అని తేల్చారు.

ఎలన్ మస్క్ కి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని తాను భావించడం లేదని, ప్రభుత్వం దగ్గర పనిచేసే టైమ్ లో రిక్రియేషనల్ డ్రగ్స్ వాడుతున్నారని నేను అనుకోను అంటూ మస్క్ ని ఉద్దేశించి ట్రంప్ కామెంట్ చేశారు. న్యూయార్క్ ఆర్థిక వేత్త జెఫ్రీ ఎప్ స్టిన్ కి సంబంధించిన కేసులో ట్రంప్ ప్రమేయం ఉందని ఆ ఫైళ్లు బయటపెడతానని గతంలో హెచ్చరించిన మస్క్ వెనక్కు తగ్గడంతో బహుశా ట్రంప్ కూడా వెనక్కి తగ్గి ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య వేడెక్కిన వాదనలు, ఆరోపణల మధ్య, టెస్లా అధినేత వ్యాపార ఒప్పందాలు కూడా ప్రస్తావనకు రావడంతోనే మస్క్ కంపెనీలన్నింటి కాంట్రాక్టులు రద్దు చేస్తామంటూ ట్రంప్ బెదిరించారు.

అయితే వారం తీవ్ర ఘర్షణల అనంతరం ఇద్దరూ కాస్త శాంతించారు. ఈ సంయమనం తాత్కాలికమా అన్నది ఇంకా తెలీదు.

Politent News Web 1

Politent News Web 1

Next Story