షాకింగ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్

దక్షిణ మెక్సికోలో వరదలు బీభత్సం సృష్టించాయి. రుయిడోసోలో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఆకస్మిక వరదలకు పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక మంది గల్లంతయ్యారు. రుయిడోసో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నది ప్రవాహానికి సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల్లో అనేక మంది చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ నమోదు కాలేదని చెప్పారు. రుయిడోసోలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మరోవైపు అమెరికాలోని టెక్సాస్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. వరదల ధాటికి 160 మందికి పైగా ప్రజలు జాడ తెలియలేదు. గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకారం, ఈ విషాదం ఇప్పటివరకు 109 మంది ప్రాణాలను బలిగొంది. జూలై నాల్గవ తేదీ ఆకస్మిక వరదలు సంభవించిన నాలుగు రోజుల తర్వాత, ప్రాణాలతో బయటపడిన వారి కోసం ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆచూకీ తెలియని వారి జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉందని అబాట్ హెచ్చరించాడు.
