మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనడం వల్ల కరేబియన్‌ ద్వీప సముదాయంలో ఒకటైన తమ మార్టినిక్‌ ద్వీపాన్ని ప్రపంచానికి పరిచయం చేశానన్న సంతృప్తి దక్కిందని మిస్‌ కరేబియన్‌ ఆరెలీ జావో కిమ్‌ భావోద్వేగానికి గురయ్యింది. మిస్‌ కరేబియన్‌గా గెలిచిన తర్వాత నిజంగా ఇది కలగా ఉందని ఉబ్బితబ్బిబ్బై పోయింది. పొలిటెంట్‌ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించింది.

తమ మార్టినిక్ చాలా చిన్న ద్వీపం అని, దాని గురించి అందరికీ తెలియకపోవచ్చునని, కానీ ఈ కిరీటంతో తమ ద్వీపాన్ని ప్రపంచానికి పరిచయం చేశానని, ఈ కారణంగా తమ ద్వీప ప్రజలు తనను చూసి గర్వపడుతున్నారని పేర్కొంది.

బాలీవుడ్ సినిమాలు చూడటానికి తాను ఇష్టపడతానని చెప్పిన ఆరెలీ జావో కిమ్‌.. భారతీయ నృత్యాలంటే తనకు ఎంతో ఇష్టమని, భారతీయుల్లా నాట్యం చేయడమన్నది తన కల అని వెల్లడించింది.

ఎవరికి వాళ్లు.. వాళ్లలాగే ఉండాలని, తమ అసలు స్వభావాన్ని వదులుకోవద్దని, అవసరమైనప్పుడు అంగీకరించాలని, తమదైన స్వభావంతో ఎవరైనా ఏదైనా సాధించగలరని మిస్‌ కరేబియన్‌ ఆరెలీ అభిప్రాయ పడింది.



Next Story