తనకు హైదరాబాద్‌ ఫుడ్‌ బాగా నచ్చిందని, వంటకాల్లో కాస్త మసాలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టేస్టీగా ఉన్నాయని మిస్‌ ఫ్రాన్స్‌ అగత్‌ చెప్పింది. ముఖ్యంగా చికెన్ మసాలా, చికెన్ బటర్ తనకు బాగా నచ్చాయంది. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అగత్‌.. తెలంగాణకు రావడం గొప్ప అనుభవమని చెప్పింది. పొలిటెంట్‌ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది.



ఈ టూర్‌లో భాగంగా.. వచ్చిన విదేశీ అందగత్తెలందరినీ చాలా మంచి ప్రదేశాలకు తీసుకెళ్లారని, చార్మినార్ చూశామని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చూశామని, అక్కడ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు తెలుసుకోవడం మంచి అనుభవమని చెప్పింది. చీర కట్టుకోవడం అంటే.. అదో మంచి అనుభూతి అని పేర్కొంది. భారతీయ సంస్కృతి చాలా ప్రత్యేకమైనదని, తన జీవితంలో ఇది కొత్త అనుభవమని, మొదట్లో తనకు హిందీ గురించిన ఎటువంటి అవగాహన లేకపోయినా, ఇప్పుడు చాలా వరకు నేర్చుకున్నానని చెప్పింది. రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతంగా ఉందని చెప్పింది.



ఈ టూర్‌కు వచ్చే ముందు ఫ్రాన్స్‌లో ఒక నెల పాటు జిమ్ చేశానని, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చానని, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసానని, ఇది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని తాను చాలా గర్వంగా భావిస్తున్నట్లు అగత్‌ వెల్లడించింది. తెలుగులో కొన్ని పదాలు నేర్చుకున్నానని, 'మీరు ఎలా ఉన్నారు?' అనడం వచ్చని చెప్పింది.


Politent News Web4

Politent News Web4

Next Story