Indian astronaut : భూమిపైన ల్యాండ్ అయిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
18 రోజులు ఐఎస్‌ఎస్ లో పలు అధ్యయనాల్లో పాలు పంచుకున్న శుక్లా

18 రోజులుగా అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రంలో 18 రోజుల పాటు వివిధ పరిశోధనలు చేసిన భారత మాత ముద్దు బిడ్డ శుభాంశు శుక్ల నింగి నుంచి భూమిపై కాలు మోపారు. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించిన డ్రాగన్ స్పేస్ క్యాప్సిల్ లో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వేకువ జామున 2.50 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది. మంగళవారం భూమి మీద దిగిన నలుగురు వ్యోమగాములను వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్దం చేసి చేసిపెట్టారు. గత నెల 25వ తేదీన నాసా సెంటర్ నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరీక్షకేంద్రానికి వెళ్లారు. అక్కడ మరో ఏడుగురు వ్యోమగాములతో కలిసి 18 రోజుల పాటు పలు పరిశోధనల్లో శుభాంశు శుక్లా బృందం పాలు పంచుకుంది. ఈ బృందం ఐఎస్‌ఎస్ లో దాదాపు 60 రకాల కీలక ప్రయోగాలు చేపట్టింది. స్పేస్ లో జీరో గ్రావిటీ స్ధితిలో మానవ కండరాలకు ఎటువంటి నష్టం కలుగుతుందనే అంశంపై శుక్లా అధ్యయంనం చేశారు. అలాగే మానవ జీర్ణ వ్యవస్ధ అంతరీక్షంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారతీయుల విద్యార్థుల కోసం శుక్లా ఒక వీడియో రూపొందించారు. మానిసిక స్ధితిపైనా, వ్యోమగాములు అధ్యయనం చేశారు. అంతరీక్షంలో వ్యవసాయానికి ఉన్న అవకాశాలపైనా వ్యోమగాములు పలు కీలక పరిశోధనలు చేశారు. సరిగ్గా 41 సంవత్సరాల క్రితం అంతరీక్షంలో కాలు పెట్టిన తొలి భారతీయుడిగా రాకేష్ శర్మ కాలుపెట్టిన తరువాత ఆయన వ్యక్త పరిచిన అనుభూతిని శుంభాశు శుక్ల వీడ్కోలు సమయంలో గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా నాడు అంతరీక్షం నుంచి భారత దేశం ఎలా కనిపిస్తోందని నాటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగిన ప్రశ్నకు సారే జహా సే అచ్ఛా అని రాకేష్ శర్మ ఇచ్చిన సమాధానాన్ని శుంభాశు శుక్లా కూడా వల్లెవేశారు.
