వాస్తవానికి తనకు నటన అంటే పెద్దగా ఆసక్తి లేదని.. అయితే, హీరో విజయ్‌ దేవర కొండతో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని మిస్‌ శ్రీలంక అనుడి గుణ శేఖర చెప్పింది. మంచి కథలు ఉంటే ఆలోచిస్తానంది. ఇక, షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ సినిమాలోని పాటలు తనకు ఎంతో ఇష్టమని, ఆ సినిమాను చూస్తే తాను కూడా భారతీయురాలినే ఫీలింగ్‌ కలుగుతుందని మిస్ శ్రీలంక తెలిపింది.

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన మిస్‌ శ్రీలంక అనుడి గుణ శేఖర పొలిటెంట్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పుడిదంతా కలలా అనిపిస్తోందని, తన ఏడేళ్ల కల నెరవేరిందని భావోద్వేగంతో చెప్పింది. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా ప్రతి రోజూ మేకప్‌, బ్రేక్‌ఫాస్ట్, స్నేహితులతో కలిసి గడపడం అలవాటైపోయిందని, ఫైనల్ తర్వాత మళ్లీ ఇలాంటి జ్ఞాపకాలు దొరకవు కదా అన్న బాధ కలుగుతోందని, అయితే, ఇవన్నీ జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలవుతాయని చెప్పింది.సాధారణంగా అందరూ అందాన్ని మాత్రమే చూస్తారు కానీ.. మిస్‌ వరల్డ్‌ అంటే అంతకంటే ఎక్కువ అని, తాము స్పోర్ట్స్, కమ్యూనికేషన్, టాలెంట్, సోషల్‌ రెస్పాన్సిబిలిటీస్‌ వంటి పోటీలను ఎదుర్కొంటున్నామని చెప్పింది.

హైదరాబాద్‌లో వాతావరణమే కాదు.. ఇక్కడి ప్రజల ఆతిథ్యం, ఇక్కడి పర్యాటక స్థలాలు ఇవన్నీ శ్రీలంకను గుర్తు చేస్తున్నాయని, హైదరాబాద్‌ వచ్చినప్పటికీ తమ స్వదేశాన్ని మిస్సవడం లేదన్న అనుభూతి కలుగుతోందని, ఇది ఒక అద్భుతమైన అనుభవం అని పేర్కొంది.



Politent News Web4

Politent News Web4

Next Story