Miss World Final tomorrow – event to be held at Hitex Hyderabad

రేపే మిస్ వరల్డ్ ఫైనల్స్ – హైటెక్స్ వేదికగా కార్యక్రమం

72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ తెలంగాణ, హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మే 31న సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది.

ప్రపంచవ్యాప్తంగా 108 మంది వివిధ దేశాల పోటీదారులు అందం, ఉద్దేశం, ఐక్యతను జరుపుకునే ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభ చాటటంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్ లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రధానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధా రెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు.

ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం భారతదేశంలో సోనీ లివ్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది, కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld.com ద్వారా హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఫైనల్స్ లో ఎంపిక విధానం

- 108 మంది పోటీదారుల నుండి, ప్రతి ఖండం (అమెరికా& కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా & ఓషియానియా) నుండి 10 మంది సెమీఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరతారు.

- కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌ కు చేరుకున్నారు,

వారి వివరాలు ఇలా ఉన్నాయి

అమెరికా & కరీబియన్:

హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా అన్నాలిసే నాంటన్ (ట్రినిడాడ్ & టొబాగో),

టాప్ మోడల్ ద్వారా ఆరెలీ జోకిమ్ (మార్టినిక్),

బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా వలెరియా పెరెజ్ (ప్యూర్టో రికో), మల్టీ మీడియా అవార్డు ద్వారా మైరా డెల్గాడో (డొమినికన్ రిపబ్లిక్).

ఆఫ్రికా: హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ ద్వారా ఫైత్ బ్వాల్యా (జాంబియా),

టాప్ మోడల్ ద్వారా సెల్మా కమన్య (నమీబియా), బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా నటాషా న్యోన్యోజి (ఉగాండా), మల్టీ మీడియా అవార్డు ద్వారా ప్రిన్సెస్ ఇస్సీ (కామెరూన్).

యూరప్: స్పోర్ట్ ఛాలెంజ్ ద్వారా ఎలిసే రండ్మా (ఎస్టోనియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ తో పాటు బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మిల్లీ మే ఆడమ్స్ (వేల్స్), టాప్ మోడల్ ద్వారా జాస్మిన్ గెర్హార్డ్ట్ (ఐర్లాండ్), మల్టీ మీడియా అవార్డ్ ద్వారా ఆండ్రియా నికోలిచ్ (మాంటెనెగ్రో).

ఆసియా & ఓషియానియా: టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ ద్వారా మోనికా కెజియా సెంబిరింగ్ (ఇండోనేషియా), హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ద్వారా ఇడిల్ బిల్గెన్ (టర్కీ), టాప్ మోడల్ ద్వారా నందిని గుప్తా (భారతదేశం), మల్టీ మీడియా అవార్డు ద్వారా ఓపల్ సుచాతా (థాయిలాండ్).

- మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారు, మరియు ఫైనల్ షో సమయంలో వెల్లడిస్తారు.

- క్వార్టర్ ఫైనల్స్ నుండి, ప్రతి ఖండం నుండి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, మరియు చివరిగా 4 ఖండ విజేతలు ఎంపికవుతారు. వారు చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ ఎన్నికవుతుంది.

ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్) కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు.

మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్‌గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందచందాలకే ప్రాముఖ్యత కాకుండా, ఈ కార్యక్రమం తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, ఉద్దేశ్యం, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుంది.

మిస్ వరల్డ్ ఫైనల్ కార్యక్రమం శనివారం (మే 31న) హైదారాబాద్ హైటెక్స్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా సోనీ లివ్, మిస్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతుంది, ప్రపంచ వ్యాప్తంగా 72 వ మిస్ వరల్డ్ ఎంపిక కార్యక్రమం ఒక మరపురాని సాయంత్రంగా మిగిలిపోనుంది.

Politent News Web3

Politent News Web3

Next Story