Nurse Nimisha Priya : నిమిష ప్రియ రక్షణ బృందం యెమన్ వెళ్ళడానికి నో
యెమన్‌లో పరిస్ధితులు బాగోలేవు అనుమతివ్వలేమన్న విదేశాంగ శాఖ

సహచరుడి హత్య కేసులో యెమన్ దేశంలో మరణశిక్ష పడ్డ నిమిష ప్రియను రక్షించడానికి ప్రయత్నిస్తున్న బృందం యెమన్ దేశం వెళ్లడానికి భారత విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం యెమన్ దేశంలో ఉన్న పరిస్ధితుల నేపథ్యంలో ఆదేశం వెళ్లడం శ్రేయస్కరం కాదని విదేశాంగ శాక అభిప్రాయపడింది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ పేరుతో నర్సు నిమిష ప్రియను మరణశిక్ష నుంచి తప్పించడానికి ఓ బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజా ఈ బృందం యెమన్ వెళ్ళడానికి భారత విదేశాంగా శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఈ బృందానికి యెమన్ లో భాద్రత దొరవడం కష్టమని, ప్రస్తుతం యెమన్ ప్రభుత్వంతో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న దృష్ట్యా ఈ బృందం యెమన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వాస్తవానికి సేవ్ నిమిష ప్రియ కౌన్సిల్ బృందం ఆమెకు పడిన మరణశిక్షను తప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నిమిష ప్రియ కుటుంబానికి అవసరమైన న్యాయ సహాయాన్ని కూడా ఈ బృందం అందిస్తోంది. యెమన్ రాజధాని సనాలో పరిస్ధితులు బాగోకపోవడంతో అక్కడి రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చమని, ఇప్పుడున్న పరిస్ధితుల్లో అక్కడకు వెళ్ళడం ప్రమాదకరమని, ఈవిషయంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.
