లాస్ ఏంజెలిస్ వైల్డ్ ఫైర్ కి కారణాలివే !!

- కార్చిచ్చును మించి ఆందోళనలు
- ఇమ్మిగ్రంట్లపై ట్రంప్ పోకడలను నిరసిస్తూ ప్రదర్శనలు
- ఆందోళనాకారులకు, అధికార్లకు మధ్య ఎడతెగని లడాయి
- అక్రమ ఇమ్మిగ్రంట్లను ఈడ్చి పారేస్తున్న అధికారులు
- లాస్ ఏంజెలిస్ లో కోట్లల్లో స్థిరపడిన విదేశీయులే ఎక్కువ
- పక్కాగా జనాభా వివరాలు తెలుసుకున్నాకే దాడులు
- ఒక్క లాస్ ఏంజెలిస్ లోనే 9 లక్షలమంది అక్రమ ఇమ్మిగ్రంట్లు
- విదేశీయులు, నాచురలైజేషన్ తీసుకుని సెటిల్ అయినవారు
- ఎక్కువగా లాటిన్ దేశస్తులు..ఆసియన్స్, పసిఫిక్ ద్వీపస్థులు
- ప్రతీ ఇంట్లో కనీసం ఒకరు అన్ డాక్యుమెంటెడ్ సిటిజన్
- ప్రతీ ఐదు మందిలో ఒకరు మిశ్రమ జాతికి చెందినవారే
ఓ వైపు కార్చిచ్చు.. మరోవైపు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ పై ఆందోళనాకారుల తిరుగుబాటుతో లాస్ ఎంజెలిస్ అట్టుడుకుతోంది. నాలుగు రోజులుగా అక్కడ ఆందోళనాకారుల నిరసనలు చల్లారటం లేదు.. మరోవైపు లాస్ ఏంజెలిస్ గవర్నర్ గెవిన్ న్యూసోమ్ ను సంప్రదించకుండా ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ గార్డులను, ఇతర దళాలను రంగంలోకి దింపడం, ఆందోళనాకారులపై కఠినమైన చర్యలకు పూనుకోవడంతో పరిస్థితి రచ్చ రచ్చగా మారింది. రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం, బాష్పవాయుగోళాల ప్రయోగం, వాటర్ కేనన్ ల ప్రయోగం వికటించి ఆందోళనలు మరింత ఎగసి పడ్డాయి. తన అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వ దళాలను ఎలా పంపుతారంటూ లాస్ ఏంజెలిస్ గవర్నర్ గెవిన్ తిరగబడ్డారు. అయినా ట్రంప్ అడుగు ముందుకే వేస్తున్నారు. ఆందోళనా కారులను నయానో, భయానో అణచివేయడమొక్కటే పరిష్కారంగా ట్రంప్ భావిస్తున్నారా? అసలు లాస్ ఏంజెలిస్ జోలికి ట్రంప్ ఎందుకు వెళ్లారు? ప్రాంతీయ గవర్నర్లుండగా, దేశాధ్యక్షుడు ఒక ప్రాంతంపై అనుమతిలేకుండా ఎలా యాక్షన్ తీసుకుంటారన్న చర్చ చివరకు రచ్చగా మారుతోంది.
ట్రంప్ యాక్షన్ వెనుక....
ట్రంప్ లాస్ ఏంజెలిస్ పై దృష్టి పెట్టడానికి అసలు కారణం వేరే ఉంది. అక్కడున్న పరిస్థితులను, ఇతర కారణాలను పరిశీలిస్తే..లాస్ ఏంజెలిస్ అనేది కోటీశ్వరులు, అధికార పరంగా శక్తిమంతులు సంపన్నులు నివసించే ప్రాంతం. అక్కడ పెద్ద సంఖ్యలో విదేశాలనుంచి వచ్చి స్థిరపడిన వారు ఇతర దేశస్తులు సిటిజన్ షిప్ తీసుకుని సెటిల్ అయిన వారున్నారు. తాను అధికారంలోకి వస్తేఇమ్మిగ్రంట్లపై కొరడా ఝళిపించడం ఖాయమని, అసలైన అమెరికా జాతికి మాత్రమే స్థానం కల్పిస్తానని చెబుతూ వచ్చిన ట్రంప్ ఈ కౌంటీపై దృష్టి పెట్టడానికి తగిన సమయం కోసం ఎదురు చూశారు. అక్కడ ఇమ్మిగ్రంట్లపై కఠినాతి కఠినమైన రూల్స్ అమలు చేస్తూ ఇమ్మిగ్రంట్స్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ICE కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఇమ్మిగ్రంట్లపై చర్యలతో ఆందోళనలు రేగాయి. ఆందోళనాకారులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలతో ఎదురు తిరిగారు. లాస్ ఏంజెలిస్ లో నాన్ అమెరికన్ రెసిడెంట్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటమే ఈ పరిస్థితికి కారణం.
లాస్ ఏంజెలిస్ లో ఎవరెవరు?
దక్షిణ కాలిఫోర్నియాలో నాలుగువేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్నదే లాస్ ఏంజెలిస్ నగరం. ఇక్కడ బెవర్లీ హిల్స్, హాలీవుడ్, లాంగ్ బీచ్, మాలిబు,పాసడెనా, శాంటా మోనికా నగరాలయితే సంపన్న వర్గాల కళ్లు చెదిరే భవంతులతో అధునాతన టెక్నాలజీతో అలరారుతుంటాయి. ఈ ఏరియాలన్నీ కలుపుకుని కోటి మందికి పైగా జనాభా ఉంటారు. కాలిఫోర్నియా జనాభాలో 27 శాతం ఇతర దేశాలు, జాతులకు చెందిన వారే ఉన్నారు.వీరంతా విదేశాల్లో పుట్టిన వారేనని, అమెరికాలో,అమెరికన్ జాతికి పుట్టిన వారు కాదని జనాభా లెక్కలు చెబుతున్నాయి.
ఇక లాస్ ఏంజెలిస్ లో మూడు కోట్ల మంది జనాభా ఉంటారు. వీరిలో 35 మంది అమెరికా బయట పుట్టిన వారేనని జనాభా లెక్కలు చెబుతున్నాయి.వీరిలో కనీసం 9 లక్షల మంది ఎలాంటి డాక్యుమెంట్లు లేని ఇమ్మిగ్రంట్లే. వీరిలో చాలా మంది దశాబ్దానికి పైగా అక్కడ ఉంటున్న వారే. సదరన్ కాలిఫోరియాకు చెందిన డార్న్ సిఫ్ యూనివర్సిటీ2020లో తీసిన లెక్కలు ఇవన్నీ.
కనీసం కుటుంబానికొకరు..
లాస్ ఏంజెలిస్ లో ఉన్న ప్రతీ ఐదుమందిలో కనీసం ఒకరు మిశ్రమ సంతతికి చెందినవారే. కుటుంబాల వారీగా లెక్కలు తీస్తే కుటుంబంలో డాక్యుమెంట్లు లేనివారు కనీసం ఒకరైనా దొరుకుతారు.
యూఎస్ ఏ టుడే నివేదికల ప్రకారం లాస్ ఏంజెలిస్ లో సగానికి సగం మంది విదేశాల్లో పుట్టి ఇక్కడ స్థిరపడి నాచురలైజేషన్ తీసుకున్నవారే.లాస్ ఏంజెలిస్ నివాసితుల్లో కనీసం 20 లక్షల మంది లాటిన్ మాట్లాడేవారు, ఐదు లక్షల మంది ఆసియా సంతతి, లేదా హవాయి, లేదా పసిఫిక్ ద్వీపానికి చెందినవారే ఉంటారు. ఇక మిగిలిన పదిలక్షల మంది ఏదో నాన్ అమెరికన్ జాతికి చెందినవారే. ఇది కాక ఇంకా కనీసం ఐదు లక్షల మంది వరకూ మిశ్రమ జాతులకు చెందిన వారుంటారు.నగరంలో సగానికన్నా ఎక్కువమంది (దాదాపు56%) ఇళ్లలో ఇంగ్లీష్ కాకుండా స్పానిష్ భాష మాట్లాడుతుంటారు.
లాస్ ఏంజెలిస్ నగరానికి ఉన్న ఈ వైవిధ్యం కారణంగానే ఇమ్మిగ్రంట్ల విషయంలో ట్రంప్ దృష్టిలో ఈ నగరం పడింది.గత శుక్రవారం ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ ఏరియాలో ఇళ్లపై దాడులు జరిపారు. ఇక్కడ లాటిన్ మాట్లాడేవారే అధికం.ఈ దాడులకు ఎదురు తిరిగిన వారిని పదుల సంఖ్యలో అరెస్టులు కూడా చేశారు.వారు అక్రమంగా వలస వచ్చిన ఇమ్మిగ్రంట్లనీ, కరడుగట్టిన గ్యాంగుల సభ్యులనీ కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు.
అధికారుల దాడులకు స్థానికులు ఎదురు తిరిగారు. నినాదాలు చేస్తూ, కోడిగుడ్లు విసురుతూ దూసుకొచ్చారు.ఆందోళనాకారులు గట్టిగా తిరగబడేసరికి వారిపై బలప్రయోగానికి సర్కార్ పూనుకుంది. వారిపై నాన్లెథల్ ఆయుధాలు, బాష్పవాయుగోళాలు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది.క్రమంగా ఈఅల్లర్లు సద్దుమణగకపోగా మరింత బలపడి లాటిన్ భాష మాట్లాడే వారిని రెచ్చగొట్టేలా చేశాయి.
అసలే ఒకవైపు కార్చిచ్చు కాల్చుకుతింటూ వేలాది ఎకరాల పంటలు బూడిద కుప్పలుగా మారుతుంటే, మరోవైపు ఆందోళనాకారులు రెచ్చిపోడంతో ట్రంప్ యంత్రాంగం పరిస్థితి అదుపు చేయడానికి 700 మెరైన్ దళాలను, నాలుగువేల నేషనల్ గార్డు ట్రూపులను లాస్ ఏంజెలిస్ వైపు మళ్లించింది.నిరసనకారులు మరింత చెలరేగి వీధుల్లో ప్రదర్శనలకు దిగడంతో డెమోక్రాట్లు కూడా ట్రంప్ నియంత పోకడలు, అణచివేత ధోరణలు నశించాలని విమర్శించడం మొదలుపెట్టారు.
జనవరి నెలలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ దేశంలో అక్రమంగా ఉంటున్న ఇమ్మిగ్రంట్లను తరిమి కొడతానని ప్రతిన బూనారు. మెక్సికో, అమెరికా సరిహద్దులను మూసేయాలని, రోజుకు కనీసం మూడు వేలమందిని అరెస్టు చేయాలన్న టార్గెట్ పెట్టుకుని యాక్షన్ తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే లాస్ ఏంజెలిస్ గవర్నర్ గెవిన్ సోమ్ కు ట్రంప్ కుమధ్య లడాయి వచ్చింది.
ఇదంతా అన్ డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రంట్లను తరిమి కొట్టడానికే.. మాట వినకపోతే అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయడానికీ సిద్ధపడుతున్నారు.అందుకే పద్ధతిగా సర్వేలు, ఇంటింటి ఎంక్వయిరీలు లేవు.. ఎఫ్ బీఐ టీమ్ తో వెళ్లడం తెల్లవారుజామున సైతం హటాత్తుగా దాడులు చేయడం లక్ష్యంగా ట్రంప్ అధికార యంత్రాంగం పనిచేస్తోంది.
