ఉక్రెయిన్‌ యుద్దంపై ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన భేటీ

ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల భేటీ ముగిసింది. అమెరికా దేశంలోని అలస్కా నగరంలో జరిగిన ట్రంప్‌, పుతిన్‌ల కీలక భేటీ ఉక్రెయిన్‌ యుద్దానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. అయితే త్వరంలో తమ మధ్య రష్యా రాజధాని మాస్కోలో మరో దఫా సమావేశం జరుగుతుందని పుతిన్‌ తెలిపారు. ట్రంప్‌, పుతినల్‌ మధ్య సమావేశం ముగిసిన తరువాత ఇద్దరు నేతల భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ భేటీలో అనేక విషయాలు తమ మధ్య ప్రస్తావనకు వచ్చాయని, అయితే ఉక్రెయిన్‌, రష్యా యుద్దానికి సంబంధించి తుది ఒప్పందం ఏదీ జరగలేదని ట్రంప్‌ తెలిపారు. చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్న ట్రంప్‌ కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని విషయాలపై చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుని అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన తరువాతే తమ మధ్య అగ్రిమెంట్‌ కుదిరినట్లు అవుతుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. త్వరలోనే యూరోపియన్‌ యూనియన్‌ నేతలతో పాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీతో మాట్లాడి పుతిన్‌ని మళ్ళీ కలుస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందని, ఇప్పంద చేసుకోవాలని తాను జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్‌ వెల్లడించారు. అయితే భేటీకి సంబంధించి పూర్తి వివరాల వెల్లడించడానికి ట్రంప్‌ నిరాకరించారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ట్రంప్‌తో చాలా నిర్మాణాత్మక సమావేశం జరిగిందని చెప్పారు. తాను ఉక్రెయిన్‌తో యుద్దం ముగించేందుకు నిజాయితీగా ఉన్నట్లు పుతిన్‌ చెప్పుకున్నారు. యుద్ద ప్రారంభ సమయంలో అమెరికాలో ట్రంప్‌ అధికారంలో ఉంటే ఉక్రెయిన్‌, రష్యా యుద్దం వచ్చేదే కాదని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌తో తనకు ఉన్న సంబంధాలు వ్యాపార సంబంధాల్లాంటివని అన్నారు. ట్రంప్‌తో తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని పుతిన్‌ ప్రకటించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story