చైనా విద్యార్థులు టార్గెట్ గా అమెరికా రూల్స్
Trump, who until recently took a swipe at Indian students, has now targeted Chinese students

అమెరికాలో అన్ని రంగాల సమూల ప్రక్షాళన జరుగుతోంది. అమెరికా గడ్డపై విదేశీయుల జనాభా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కకపోగా… ప్రపంచ స్థాయి కంపెనీలకు విదేశీయులే నాయకత్వం వహిస్తున్నారు.
వీటన్నింటీలో సంస్కరణలు తీసుకొచ్చి అమెరికన్ ఫస్ట్ నినాదంతో ట్రంప్… కఠిన విధానాలు రూపొందిస్తున్నారు. ఇటీవలి వరకు భారతీయ విద్యార్థులపై కత్తిగట్టిన ట్రంప్ ఇప్పుడు చైనా విద్యార్థులను లక్ష్యం చేసుకున్నారు. విదేశీ విద్యార్థుల వీసాలు తగ్గిస్తున్న అమెరికా… ఆ దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారి వీసాలను కూడా రద్దు చేసేందుకు సిద్దమైంది. తాజాగా చైనా విద్యార్థుల వీసాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న విద్యార్థుల వీసాలను, క్లిష్టమైన రంగాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల వీసాలను రద్దు చేసే ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు.
అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉండగా.. రెండో స్థానంలో చైనీస్ ఉన్నారు.
2023--------------- --- -2024 సంవత్సరంలో 2 లక్షల 70 వేల మంది చైనా విద్యార్థులు అమెరికా చదువులకు వెళ్లారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో నాలుగోవంతు చైనా విద్యార్థులే ఉన్నారు.
అమెరికా సర్కారు విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను మంగళవారం రద్దు చేసింది. విద్యార్థి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వారిపై నిఘా పెంచాలని అమెరికా నిర్ణయించింది.
అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కులపై మాట్లాడే అమెరికా… తన వరకు వచ్చేసరికి కఠినమైన నిబంధనలు అమలు చేయడం గమనార్హం.
