సుంకం పెంచుతున్నట్లు నోటీసు జారీ చేసిన అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌

భారత్‌పై అమెరికా తన సుంకాల దాడిని కొనసాగిస్తోంది. తాజాగా భారతదేశంపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసులు విడుదల చేసింది. భారతదేశం నుంచి వచ్చే దిగుమతులపై ఈ అదనపు సుంకాలు వర్తిస్తాయని అమెరికా బహిరంగంగా నోటీసు విడుదల చేసింది. ఈ ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి నుంచే అ అదనపు సుంకాల విధింపు అమల్లోకి వస్తుందని అమెరికా విస్పష్టంగా ప్రకటించింది. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఆ దేశ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ద్వారా ఈ నోటులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆగస్టు 6వ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం కూడా ఉంది. గడవు ముగిసిన తరువాత వచ్చిన లేకపోతే గోడౌన్ల నుంచి బయటకు తీసుకు వెళ్ళే ఏ వస్తువుకైనా ఈ సుంకాలు వర్తియాని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. రష్యాతో వ్యాపారం చేసే ఇతర దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. అలాగే మాస్కోపై కూడా అదనపు ఆంక్షలు విధిస్తామనే సంకేతాలను ఈ నోటీసు ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ రష్య నుంచి చమురు కొనుగోలు చేసే వారిపై ఇటువంటి చర్యలను అమెరికా చేపట్టలేదు. కానీ ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్‌ భారత్‌పై అతనంగా 25 శాతం సుంకాలను విధించారు. దీంతో భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుకం 50 శాతం అయ్యింది.

Politent News Web 1

Politent News Web 1

Next Story