రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టాక సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధించారు. దీనిపై అమెరికా ట్రెడ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టమొచ్చినట్టుగా టారీఫ్ లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తెగేసి చెప్పింది. అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని తేటతెల్లం చేసింది.

టారీప్ల ఆంశంపై కోర్టులో వాదనల సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతల ఆంశాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తావించగా కోర్టు తోసిపుచ్చింది. తాజా తీర్పుతో చైనాతో వాణిజ్య వ్యవహారాలు, భారత్ పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెంచుతుందని ట్రంప్ తరపు న్యాయవాదులు వాదన చేశారు. సుంకాలకు సంబంధించి అనేక దేశాలతో చర్చలు జరుగుతున్న ఆంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుంకాల వ్యవహారం ఫైనల్ చేసేందుకు జులై 7 వరకు సమయం ఉందని…అప్పటి వరకు ఈ ఆంశంలో జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం కోరింది. దేశాధ్యక్షుడికి ఉన్న టారీఫ్ పవర్ ను సమర్థించాలని ట్రంప్ అధికార బృందం న్యాయస్థానానికి విన్నవించింది.

ప్రభుత్వం తరపున వచ్చిన అన్ని ప్రతిపాదనలను యుఎస్ ట్రెడ్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో టారీప్ లో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ట్రంప్ విధానాల అమలు మలుపులు తిరిగే అవకాశం ఉంది.

Next Story