విశాఖ కేంద్రకారాగారంలో వినూత్న రీతిలో యోగా దినోత్సవం

Yoga Day celebrated in an innovative way at Visakhapatnam Central Jail

Update: 2025-06-21 09:48 GMT
  • వెయ్యి మంది ఖైదీలతో యోగాసనాల ప్రదర్శన
  • ఇండియన్ మ్యాప్ ఆకారంలో యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు శనివారం విశాఖపట్నంలో ఉన్న కేంద్ర కారాగారంలో వినూత్న రీతిలో యోగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేపథ్యంలో దాని నుంచి స్పూర్తి పొందిన విశాఖ సెంట్రల్ జైల్ అధికారులు ఖైదీలతో వినూత్న తరహాలో యోగాసనాలు వేయించారు. దాదాపు వెయ్యి మంది ఖైదీలకు యోగాకు అనువుగా ఉండే దుస్తులు అందించి జైలు ఆవరణలోనే యోగాసనాలు వేయించారు. అలాగే ఈ కార్యక్రమంలో కొంత మంది ఖైదీలు ఇండియా మ్యాప్ ఆకారంలో నిలబడి చేసిన యోగాసనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం లో పర్యవేక్షణాధికారి మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు, జైలర్స్, డిప్యూటీ జైలర్లు గార్డింగ్ సిబ్బంది అందరూ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధికారులకు యోగా ప్రాధాన్యతను ఖైదీలకు వివరించారు. మన దైనందిన జీవితం లో యోగా ను చేర్చుకోవడం వలన క్రమశిక్షణ ,ఆరోగ్యం చేకూరుతాయని సెంట్రల్ జైలు ఖైదీలకు వివరించారు.  శనివారం విశాఖ సెంట్రల్ జైలులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం లో 100 మంది గార్డింగ్ సిబ్బంది 1000మంది ఖైదీలు పాల్గొని ఇండియన్ మేప్ ఆకారంలో యోగాసనాలు వేశారు. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో అలరించాయి.

Tags:    

Similar News