Ap Cm Chandrababu : ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటనకు ఏపీ సీయం
శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు చంద్రబాబు బృందం;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సింగపూర్ పర్యటనకు ఎపీఎన్‌ఆర్‌టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జూలై 26వ తేదీ రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్న ఏపీసీయం 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు. మొదటి రోజు సింగపూర్ లో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగే డయాస్పోరా ఫ్రం సైత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమలో సియం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సింగపూర్ తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ సహా పలు దేశాల నుంచి ప్రవాశాంధ్ర పారిశ్రామిక వేత్తలు, వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 1500 మంది ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరవుతారు. సింగపూర్ లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ డయాస్పోరా ఫ్రం సైత్ ఈస్ట్ ఏషియా సదస్సుకు ఏపీఎన్‌ఆర్‌టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటుగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఎపి అభివృద్దిలో భాగస్వాములు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించి జీరో పావర్టీ -P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలకు సీయం చంద్రబాబు పిలపునివ్వనున్నారు. సీయం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో పెట్టుబడుల సాధన కోసం కృషి చేయనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సిఎం చంద్రబాబు బృందం భేటీ అవుతారు. పలు దేశాలకు ఎపి నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్నారైల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు చేయడంపై వారితో చర్చిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంపై ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తారు. స్పోర్ట్స్, పోర్ట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సిఎం బృందం సందర్శిస్తుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాలోకేష్, పొంగూరు నారాయణ, టీజీభరత్, వివిద శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.