New Trend In AP : ఏపీ డీజీపీ తాలుకా…!
వైఎస్.జగన్ ఇంటి వద్ద దర్శనమిచ్చిన ద్వాచక్ర వాహనం;
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సంస్కృతి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొంత మంది యువకులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై నేను ఫలానా వారి తాలూకా అని రాసుకుంటూ తిరుగటం మొదలు పెట్టారు. మొట్టమొదటిగా కాకినాడ ప్రాంతంలో ఒక యువకుడు తన ద్విచక్ర వాహనంపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూక అని రాసుకు తిరగం మొదలు పెట్టాడు. అది చూసిన తరువాత కోస్తా జిల్లాల్లో అనేక మంది యువకులు డిప్యూటీ సీయం తాలూకా అని, ఫలానా ఎమ్మెల్యే తాలూకా అని, ఫలానా ఎంపీ తాలూకా అని తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై రాసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఈ మధ్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా తమ వాహనాల మీద ముగ్గురికి దడ పుట్టించిన మగాడి తాలూకా… అన్ని హామీలు అమలు చేసిన మొనగాడి తాలూక అని రాసుకుంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజా ఒక ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్‌పై ఏపీడీజీపీగారి తాలూకా అని రాసి ఉండటం కనిపించింది. విచిత్రం ఏంటంటే ఆ ద్విచక్ర వాహనం ఒక పోలీసుది అవడం. వాహనంపైన పోలీస్ అని రాసి ఉంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వాహనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఇంటి వద్ద దర్శనమిచ్చింది. మాజీ సీయం ఇంటి వద్ద బందోబస్తుకు వచ్చిన అనంతపురం ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కు చెందిన జవాన్ దిగా చెపుతున్నారు. అయితే అటుగా వెళుతున్న వారు ఈ వాహనాన్ని చూసి కంచే చేను మేసిన చందంగా ఒక బాధ్యతా యుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండి ఈ విధంగా నిబంధనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ల మీద ఇలా రాసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా వాహనాల నెంబర్ ప్లేట్లపై నెంబర్ తప్ప ఇతర వివరాలు ఏవి ఉన్నా పోలీసులు ఆపి జరిమానాలను విధిస్తూ ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక లెక్కుకు మిక్కిలిగా యువకులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై అసలు నెంబరే లేకుండా తమకు ఇష్టం వచ్చిన కొటేషన్లు రాసుకుని తిరుగుతున్న పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.