AP High Court: డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుకు అనుమతించాలి: ఏపీ హైకోర్టు స్పష్టం
ఏపీ హైకోర్టు స్పష్టం
By : PolitEnt Media
Update: 2025-09-10 10:56 GMT
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు అంశంపై విచారణ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టివేసింది. వాదనల సందర్భంగా, డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ రాజకీయ కారణాలతో దాఖలు చేయబడిందని పేర్కొంటూ పిల్‌ను డిస్మిస్ చేసింది. సమాజానికి ఉపయోగపడే ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.