ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల

AP Intermediate Advanced Supplementary Results Released

Update: 2025-06-07 11:23 GMT

ఏపీలో ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు సప్లిమెంటరీ రిజల్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. గతేడాది వార్షిక పరీక్షల ఫలితాల అనంతరం మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఫలితాలు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన వాళ్లు.. రిజల్ట్స్‌ను అఫీషియల్‌ వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చునని ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. అలాగే, విద్యార్థులు సులభంగా తెలుసుకునేలా.. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు "HI" అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు.



ఈ యేడాది మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన వాళ్లకోసం సప్లిమెంటరీ పరీక్షలు.. అలాగే, అన్ని సబ్జెక్టుల్లో పాసైనప్పటికీ.. తమ మార్కుల స్కోరు పెంచుకోవాలనుకున్న వాళ్లకోసం బెటర్‌మెంట్‌ ఫరీక్షలు మే నెలలో నిర్వహించారు. ఈ ఫలితాలు కూడా వెలువడటంతో.. స్టూడెంట్స్‌ రెగ్యులర్ డిగ్రీ, ఇతర సమాన కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభించింది.


Tags:    

Similar News