AP Police Recruitment: ఏపీ పోలీస్ శాఖలో 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎస్‌ఐ, కానిస్టేబుల్లకు శుభవార్త
ఎస్‌ఐ, కానిస్టేబుల్లకు శుభవార్త
AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు మరో మంచి వార్త. రాష్ట్ర పోలీస్ శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌ఐ విభాగంలో సివిల్ 253, ఏఆర్ 116, ఎస్‌పీఎఫ్ 09, కమ్యూనికేషన్ 50, పీటీవో 10 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ విభాగంలో 542 సివిల్, 285 ఏఆర్, కమ్యూనికేషన్ 200, మెకానిక్స్, డ్రైవర్లు 213 పోస్టులు భర్తీ చేయనున్నారు. అదనంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్, జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో 171 వార్డర్ (పురుషులు, మహిళలు), సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎఫ్‌ఎస్‌ఎల్) 43 పోస్టులు కూడా ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలోనే APSLPRB ప్రకటించనుంది.
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.