Kakani Govardhan Reddy : రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు

కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి;

Update: 2025-08-22 11:32 GMT
  • దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరో ప్రాధాన్యత లేని దోపిడీ ప్రభుత్వమిది..
  • కూటమి పాలనలో రాజ్యమేలుతున్న అవినీతి మాఫియా..
  • సాగు ముందస్తు ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం..
  • యూరియా కోసం అన్నదాతల అగచాట్లు..

కూటమి పాలనలో రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఏ విధంగా దోచుకుని, అవినీతి సంపాదన కూడబెట్టుకుందామన్న ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలు, వారి సంక్షేమం గురించి ఆలోచించే తీరిక లేదని మండిపడ్డారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు కరువుతో అన్నదాతలు అగచాట్లు పడుతుంటే, వారిని ఆదుకోవడానికి నిర్ధష్టమైన కార్యాచరణ లేని, కనీసం సమీక్ష కూడా నిర్వహించన ప్రభుత్వ తీరును కాకాణి తీవ్రంగా ఆక్షేపించారు.

ముఖ్యమంత్రి సినిమా సెట్ లు ఏర్పాటు చేసుకుని ప్రసంగాలివ్వడం తప్ప.. సంక్షోభంలో ఉన్న వ్యవసాయం గురించి, రైతు సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. భారతదేశ చరిత్రలో రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని నిందించారు. భారీ వర్షాలు కురుస్తుంటే... పంట ఏ మేరకు నష్టపోయిందన్న అంచనాలు లేవు. మరోవైపు వర్షాభావ పరిస్థితులన్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి అన్న ఆలోచన, కార్యాచరణ ప్రణాళిక కూడా కరువైంది. ఇది అత్యంత దుర్మార్గమన్నారు.

రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్యమిది

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని మాజీ మంత్రి కాకాణి చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికల్లోనే ఎరువులు ఏమైనట్లు అన్న వార్త ఎరువులు ఏ విధంగా పక్కదారి పడుతున్నాయన్న విషయం స్పష్టమవుతోందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతరపురం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎరువులు సమస్య ఎక్కువగా ఉంది. రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వలేకపోతే... పంట నాణ్యత దెబ్బతిని రైతులు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు దుకాణాలకు, వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఇవాళ బ్లాక్ మార్కెట్ లో యూరియా ఒక బస్తాకు రూ.200 అదనంగా ఖర్చు పెట్టి కొనాల్సిన దౌర్భాగ్య పరిస్ధితులు నెలకున్నాయని మాజీ మంత్రి కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పథకాలను, పక్కనున్న తెలంగాణా, కర్ణాటకలో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి న చంద్రబాబు ..ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతో వాటన్నింటినీ ప్రకటించాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మర్చిపోయి...ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడటం లేదని కాకాణి ఎద్దేశా చేశారు. ఇచ్చిన హామీలేవీ చెయ్యకుండానే ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అన్నీ చేసేశామని చెబుతుంటే... ప్రజలు నవ్వుతారు అన్న ఆలోచన కూడా లేదు. నిస్సిగ్గుగా కన్నార్పకుండా అబద్దాలు చెబుతున్నాడని కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News