YS Jaganmohan Reddy : చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోంది

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగిన తీరుపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్‌జగన్‌;

Update: 2025-08-13 11:52 GMT

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 15 పోలింగ్‌ బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌ను రానివ్వకుండా టీడీపీ గూండాలు రిగ్గింగ్‌ చేసుకున్నారని, ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందన ఏజెంట్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించిన సంఘటన రాష్ట్రంలో తొలిసారి జరిగిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకంపై బుధవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో వైఎస్‌జగన్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్యం కనిపించడం లేదని అందుకు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే నిదర్శనమన్నారు. పోలీసుల ప్రోద్భలంతో బూత్‌లలోకి ఏజెంట్లను రానివ్వలేదని ఇంత దారుణమైన ప్రజాస్వామ్యం ఎక్కడా ఉండదని వైఎస్‌జగన్‌ మండిపడ్డారు. ప్రజాస్వమ్యంపై నమ్మకమున్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే ఎన్నికలు హాస్యస్పదం అవుతాయన్నారు. చంద్రబాబు ఆయన పెంచిపోషిస్తున్న ఎల్లో మీడియా ప్రధాన లక్ష్యం దోచుకో.. పంచుకో.. తినుకో తప్ప వేరేది లేదన్నారు.

చంద్రబాబుకు సవాల్‌

చంద్రబాబుకు తన పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, ప్రజలకు మంచి చేశారన్న నమ్మకంతో వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, ఈ ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండని వైఎస్‌జగన్‌ ఏపీ సీయం చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఆ నమ్మకం మీకు లేదు కాబట్టే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు జరిపారని విమర్శించారు. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే వ్యక్తిని లీడర్‌ అనరని మానిప్యులేటర్‌, ఫ్రాడ్‌స్టర్‌ అంటారని జగన్‌ ఎద్దేశా చేశారు. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్‌ అనరు. మాన్సటర్‌ లేదా ఫ్రాడస్టర్‌ అంటారు. ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే పోలింగ్‌ బూత్‌లు మార్చేశారు ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. ఇంకా నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి పోయి ఓటు వేయాలంట. 4 కి.మీ నడిచి పోవాలి… అలా పోలింగ్‌ సెంటర్లు అక్కడిది ఇక్కడ.. ఇక్కడిది అక్కడికి మార్చారని వైఎస్‌జగన్‌ ఆరోపించారు.

ఓట్లు వేయకూడదు. అదే వారి లక్ష్యం

దాదాపు 10,600 ఓట్లకు గానూ, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్‌ అక్కడే మొదలైంది. అంటే, ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కి.మీ నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది. పులివెందుల జడ్పీటీసీ కింద ఆరు పంచాయితీలు, 15 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే.. ఆ ఆరు పంచాయితీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను పెట్టారు. ప్రజలకు భద్రత కోసం కాదు. కేవలం వారిని భయపెట్టడం కోసమే అంత మంది పోలీసులను పెట్టారని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 4 గం కల్లా ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్‌కు దాదాపు 400 మంది పాగా వేశారని కావలంటే ఆధారాలు చూపిస్తామని జగన్‌ చెప్పారు.

పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయటి నుంచి వచ్చిన టీడీపీ నాయకులు అంతా కలిపి దాదాపు 7 వేల మంది ఉన్నారని అంటే ఒక్కో ఓటరుకు బయటి నుంచి ఒక్కో రౌడీని తీసుకువచ్చి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయనడం హస్యాస్పదం అన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారి ఫోటోలు చూపించి వారి వివరాలను వైఎస్‌.జగన్‌ వెల్లడించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన పోలీసులు ఏకంగా పచ్చ చొక్కా వేసుకుని పనిచేశారు అని వైఎస్‌.జగన్‌ మండిపడ్డారు. డీఐజీ కోయ ప్రవీణ్‌ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావుకు సమీప బంధువని వరసకు అల్లుడు అవుతాడని ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు అరాచకంగా జరిపారని జగన్‌ ఆరోపించారు. కాల్చి పారేసా నా కొడకా అంటూ డీఎస్పీ మురళి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లని బెదిరించడం ప్రజాస్వామ్యం అపహస్యానికి పరాకాష్ట అని వైఎస్‌.జగన్‌ అన్నారు. ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకంటారని ఇటువంటి దౌర్భాగ్యపు పనులు చేస్తే మూడున్నర సంవత్సరాల తరువాత డిపాజిట్లు కూడా రావని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

Tags:    

Similar News