Pawan Kalyan: ప్రజల ఆశయాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోంది: పవన్ కల్యాణ్
కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోంది: పవన్ కల్యాణ్
By : PolitEnt Media
Update: 2025-09-10 12:07 GMT
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కోరుకున్న పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, యువత, మహిళలు, రైతుల భవిష్యత్తు కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. అలాగే, ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలను నిర్వహించినట్లు గుర్తు చేశారు.