సుజనా చౌదరని పరామర్శించిన మాజీ సీయం నల్లారి
By : Politent News Web 1
Update: 2025-05-27 09:08 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ శాసనసభ్యుడు సుజనా చౌదరి నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని సుజనా చౌదరి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం లండన్ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి అక్కడ ఒక మాల్ లో ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆయన భుజానికి గాయం అయ్యింది. ఇటీవలే ఆయనకు హైదరాబాద్ లో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన తరువాత హైదరాబాద్ లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుజనా ఇంటికి వెళ్లిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజా క్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి అతి త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవలో పునరంకితం కావాలని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.