Indigo Flight : తిరుపతి ఇండిగో విమానానికి సాంకేతిక లోపం
45 నిమిషాల ప్రయాణం తరువాత తిరిగి తిరుపతిలోనే ల్యాండ్ అయిన ఫ్లైట్;
తిరుపతి నుంచి హైదారాబాద్ వెళ్ళే ఇండిగో ఫ్లైట్ కి తృటిలో ప్రమాదం తప్పిది. ఆదివారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ కి 45 నిమిషాల ప్రయాణం తరువాత సాంకేతిక సమస్య తలెత్తింది. దీందో పైలట్ ఫ్లైట్ ను వెనక్కి తిప్పి మళ్ళీ తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అక్కడే ప్రయాణికులను అందరినీ దించివేసి సోమవారం ఉదయానికి ఫ్లైట్ అరేంజ్ చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే వెంకటగిరి వద్ద పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో పైలట్ వేగంగా స్పందిచి ఏటీసీని సంప్రదించి విమానాన్ని సురక్షితంగా తిరిగి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 221 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరందరూ సురక్షితంగానే ఉన్నారు. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కాలంలో అనేక విమానయాన సంస్ధలకు చెందిన విమానాలకు గాలిలో ఎగురుతున్న సమయంలోనే తరచు సాంకేతి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ప్రయాణికులు విమాన ప్రయాణాలు అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్ధితులు ఏర్పడ్డాయి.