Ysrcp Satishreddy : పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతం అనడం విడ్డూరం

తెలుగుదేశం మీడియా రాస్తున్న వార్తలపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి;

Update: 2025-08-16 06:09 GMT

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని తెలుగుదేశం మీడియా రాయడం విడ్డూరంగా ఉందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీసతీష్‌రెడ్డి మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన సతీష్‌రెడ్డి టీడీపీ అనుబంధ మీడియా రాస్తున్న దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్ధితి ఉందన్నారు. వైఎస్‌.జగన్‌మోమహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని సతీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ కూడా ఇప్పటి వరకూ ఏనాడు ఎన్నికల సందర్భంగా పులివెందుల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు చేయలేదని సతీష్‌రెడ్డి గుర్తు చేశారు. అలాంటప్పుడు 30 ఏళ్ళుగా పులివెందులలో ప్రజాస్వమ్యం లేదని ఎలా వార్తలు రాస్తారని ఆయన నిలదీశారు. గతంలో నేను టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజంకాదా అని సతీష్‌ రెడ్డి నిలదీశారు. ఇప్పుడు పులివెందులలో కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయాన్ని తీసుకు వచ్చిందని సతీష్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీ అధికారిక సోషల్‌ మీడియిలో పెట్టిన ఫొటోల్లోనే దొంగ ఓటర్లు స్పష్టంగా కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్‌ తాను ఉన్న ఫొటోలో దొంగ ఓటర్లు ఉన్నాడని గ్రహించి సోషల్‌ మీడియాలో ఆయన ఫొటోను డిలీట్‌ చేయలేదా అని ప్రశ్నించారు. మేము చూపించిన వాళ్ళు దొంగ ఓటర్లు కాదని నిరూపించగలరా అని సతీష్‌ రెడ్డి నిలదీశారు. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్‌ చేయాంచారని సతీష్‌ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీయం సతీమణి ఫోన్‌ చేసి అభినందించడం దారణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్వీసతీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News