Ap BJP Chief PvnMadhav : కేరళ తరహా లో కోనసీమ అభివృద్ధి జరగాలి
చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్;
కేరళ తరహా లో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆవిధంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్ర లో బాగంగా అమలాపురం లో ఛాయ్ పే చర్చ లో మాధవ్ మాట్లాడుతూ కోనసీమ ప్రకృతి అందాల హరివిల్లు అని కొనియాడారు. కోనసీమ పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కోనసీమ ఎటువైపు చూసినా గోదావరి జీవ నది మరో వైపు సముద్ర తీరం ఈవిధమైన నేపథ్యంలో పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. కోనసీమ కు రైల్వే లైన్ లేక పోవడం దురదృష్ట కరమని లోక్ సభ స్పీకర్ బాలయోగి సమయం లో రైల్వే లైన్ కు సర్వే జరిగిందని కొంకణ్ రైల్వే తరహా లో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు. కోనసీమ ప్రాంతం ప్రాచీన దేవాలయాలు నిలయంమనిటెంపుల్ టూరిజం విషయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ అన్నీ స్వయం భూ దేవాలయాలే అని అందువల్ల దర్శనీయ క్షేత్రాలుకు భక్తులు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుందని ఆదిశగా అభివృద్ధి జరగాలని మాధవ్ అన్నారు. మనం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలని స్వదేశీ వస్తువు లు కొనుగోలు పెరగాలన్నారు. వినాయక చవితి కి మట్టి విగ్రహాలు కొనుగోలు చేస్తే స్థానికంగా మట్టి బొమ్మలు తయారీ దార్లను ప్రోత్సహించినట్లు అవుతుంది పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతామని మాధవ్ అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆటో కార్మికులను ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారని మాధవ్ తెలిపారు.