Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు దుర్ఘటన: ద్విచక్ర వాహనం బస్సును ఢీకొనడంతో రైడర్ మృతి, 20 మందికి పైగా మరణం
20 మందికి పైగా మరణం
Kurnool Bus Tragedy: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి-44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టిన వెంటనే ముందుభాగంలో మంటలు చెలరేగాయి. బస్సు బైక్‌ను 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మంటల్లో కాలిపోతున్న బస్సు, పూర్తిగా దగ్ధమైన వాహన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కొందరు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డప్పటికీ, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద స్థలంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రహదారి భద్రత, వాహనాల ప్రయాణ సమయాలు, డ్రైవర్ల జాగ్రత్తలపై ప్రశ్నలు లేవనెత్తింది.