Minister Nara Lokesh: వైసీపీ కార్యకర్తకు మంత్రి నారా లోకేశ్ సాయం: సీఎంఆర్ఎఫ్ ద్వారా అభయ హస్తం

సీఎంఆర్ఎఫ్ ద్వారా అభయ హస్తం

Update: 2025-09-13 13:33 GMT

Minister Nara Lokesh:  ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా సాయం అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ పేరుతో ఆ కార్యకర్త లోకేశ్‌కు ట్వీట్ చేస్తూ, తాను ఆపదలో ఉన్నానని, సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించాలని కోరారు.

ఈ విజ్ఞప్తికి మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా అవసరమైన సాయం తప్పక అందజేస్తానని ఆ కార్యకర్తకు భరోసా ఇచ్చారు. వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా లోకేశ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తకు సాయం అందించేందుకు మంత్రి నారా లోకేశ్ ముందుకు రావడం సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది.

Tags:    

Similar News